Akhil who fell in love again.. What is the end of the matter..?
mictv telugu

పెళ్లి వార్తలపై అఖిల్ క్లారిటీ..తన ప్రేమ విషయం చెప్పేశాడు..!

March 19, 2023

Akhil who fell in love again.. What is the end of the matter..?

చిన్న వయుస్సులో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోలలో అఖిల్ అక్కినేని ఒకరు. తన 23వ ఏటనే 2016లో తాను ప్రేమించిన అమ్మాయి శ్రియ భూపాల్‌తో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. తర్వాత కొన్నాళ్లకు విడిపోయారనుకోండి. పెళ్లి ఏర్పాట్లలో పెద్దలు బిజీగా ఉండగా అఖిల్-శ్రీయ భూపాల్‌ జంట్ సడన్ గా షాకిచ్చింది. ఇద్దిర మధ్య బేదాభిప్రాయాలు తలెత్తడంతో ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలు సర్ది చెప్పినా పెళ్లి చేసుకునేందుకు ససేమిరా అన్నారు. దీంతో చేసేది ఏం లేక పెళ్లిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత శ్రియా భూపాల్ వేరే వారిని పెళ్లి చేసుకుని వెల్లిపోగా అఖిల్ సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ఉండిపోయాడు. కెరీర్‌పై ఫోకస్ పెట్టాడు.

అయితే ఇటీవల కాలంలో మరోసారి అఖిల్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి. అఖిల్ మళ్లీ ప్రేమలో పడ్డారని..త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై తాజాగా అక్కినేని అందగాడు క్లారిటీ ఇచ్చాడు. సీసీఎల్‎లో తెలుగు వారియర్స్‎కు కెప్టెన్‎గా ఉన్న అఖిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు వెల్లడించాడు.

“నా పెళ్లిపై రకరకాలుగా వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. కానీ అవ‌న్నీ రూమ‌ర్స్ మాత్ర‌మే. ప్రస్తుతం నాకు పెళ్లి ఆలోచ‌న లేదు. ఇంకొన్నాళ్లు సింగిల్ గానే ఉండాల‌ని అనుకుంటున్నా. ఇక‌ నా దృష్టిలో లవ్ అనేది స్పోర్ట్స్ లాంటిదే. తనతో పాటు ఆడుతున్న ప్లేయర్స్ అందరూ తనకు చాలా స్నేహితులుగా ఉంటారు. తన చిన్నప్పుడు స్కూలులో ఒకపక్క క్లాసులు జరుగుతుంటే వెళ్లిపోయి క్రికెట్ ఆడుకునే వాళ్లం. చిన్నప్పుడు నేనే కెప్టెన్. క్రికెట్ ఆడే క్రమంలో ఎన్నో కిటికీల అద్దాలు పగలుకొట్టిన విషయం ఇంకా గుర్తుంది. నాకు సోషల్ మీడియా అంటే భయం. కేవలం సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రమే షేర్ చేస్తుంటా” అని అఖిల్ వివరించాడు.

అఖిల్ చిన్నతనంలో సిసింద్రీగా నటించాడు. ఇంటి నుంచి కిడ్నాప్ చేయబడిన పిల్లవాడిగా అఖిల్ చేసిన అల్లరి ఇప్పటికీ మరిచిపోలేం. సిసింద్రీ సమయంలో అఖిల్ వయుస్సు కేవలం ఒక సంవత్సరం మాత్రమే. తర్వాత అఖిల్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ చిత్రాల్లో నటించి ఓ మోస్తరు ఫలితాలను అందుకున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఏజెంట్‌ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుక సిద్ధమయ్యాడు. ఈ చిత్రం స‌మ్మ‌ర్ లో విడుద‌ల కాబోతోంది.