ఆ ఒక్కటి అస్సలు రానీయోద్దు - MicTv.in - Telugu News
mictv telugu

ఆ ఒక్కటి అస్సలు రానీయోద్దు

June 17, 2017

చంద్రబాబు నాయుడుకు దినాం ఏదో ఒక తలనొప్పి వస్తనే ఉంది. తాజాగొచ్చిన నొప్పి లోకేష్ నుండి ట్రాన్స్ ఫర్ అయి మంత్రి అఖిలప్రియ రూపంలో తన్నుకొనొచ్చింది. ఆమె ప్రవర్తన వల్ల చానా మంది నంద్యాల సైడున్న పెద్ద పెద్ద లీడర్లు బాగా నారాజ్ అయితున్నరని రెండు మూడు రోజుల నుండి వార్తలొస్తున్నవి. కొంత మంది లీడర్లు సైకిలొదిల ఫ్యాన్ కిందికి పోతున్నరట…. దీనికి కారణం అఖిలనే అని పార్టీల టాక్. లోకేషం తప్పులనే దిద్దలేక చేతులేత్తేసిన బాబు…. అఖిల ప్రియ విషయంలో కాస్త రెస్పాండ్ అయ్యారు. ఆ విధంగా ముందుకెళ్లాలని సెలవిచ్చినట్లుంది…. అందుకే ఏ.వి. సుబ్బారెడ్డికి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు మంత్రి గారు. రాజకీయాలకు కొత్త పైగా మంత్రి….కొంచె శక్తికి మించిన బరువే… అన్ని అలవాటు అయ్యేంత వరకు ఇబ్బందులు తప్పవు. కాస్త ఎన్కా ముందు చూసుకుపోతే అంతా సర్దుకుంటుంది. అఖిల ప్రియ మాత్రం ఇదంతా ఏజ్ గ్యాప్ వల్లనే జరిగిందని… తమ మధ్యన ఎలాంటి విబేధాలు లేవని చెప్పింది. అందుకే ఏజీ గ్యాప్ ఉన్నా…. సీనియర్లు, జూనియర్లు అయినా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండ చూసుకుంటే ఇంకా మంచిది. మాటలతోని మంటల పెడుతున్న లోకేషాని కంటే అఖిల ప్రియ అన్నీ విధాల బెటరే అంటున్నరట తెలుగు తమ్ముళ్లు.