Akhilesh Yadav shares video of IPS officer demanding rs.20 lakh bribe
mictv telugu

భర్త ఐపీఎస్.. భార్య డీసీపీ.. రూ.20 లక్షలు లంచం డిమాండ్

March 13, 2023

Akhilesh Yadav shares video of IPS officer demanding rs.20 lakh bribe

యూపీలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఐపీఎస్ అధికారి వీడియో ఒకటి ఆదివారం నాడు తెగ వైరల్ అయింది. ఓ వ్యాపారవేత్త నుంచి ఐపీఎస్ అధికారి డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు ఉన్న ఆ వీడియోను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ లో నిన్న షేర్ చేశారు. ఆ అధికారిపై ‘బుల్‌డోజర్’ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అని సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం వెంటనే ఆ వీడియో దర్యాప్తునకు ఆదేశించింది.

అనిరుధ్ సింగ్ అనే ఐపీఎస్ అధికారి 20 లక్షలు లంచం తీసుకుంటున్న ఆ వీడియోలో పరిశీలించిన అధికారులు.. అతని మీద విచారణ జరపాలని వారణాసి పోలీస్ కమిషనర్‌ను ఉత్తరప్రదేశ్ డీజీపీ ఆదేశించారు. ఇక ఇదే కాకుండా వారణాసిలో డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్‌గా పని చేస్తున్న అనిరుధ్ సింగ్ భార్య ఆర్తి సింగ్ ఇంటి అద్దె చెల్లించలేదనే ఆరోపణలపై కూడా విచారణకు ఆదేశించారు. అయితే తాను నిజంగా లంచం తీసుకోలేదని, ఓ అత్యాచార నిందితుడిని ట్రాప్ చేయడానికి తాను ప్రయత్నిస్తున్న వీడియో అని, అది చాలా పాతదని అంటున్నాడు అనిరుధ్.

బీహార్‌కు చెందిన అనిరుధ్, 2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈ ఏడాది జనవరిలో ఫతేపూర్ జిల్లా నుంచి మీరట్‌కు బదిలీ అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.