మీకు చేతకాకపోతే భారత్ సాయం తీసుకోండి - పాక్ క్రికెటర్ - MicTv.in - Telugu News
mictv telugu

మీకు చేతకాకపోతే భారత్ సాయం తీసుకోండి – పాక్ క్రికెటర్

March 17, 2022

cvb

పాకిస్థాన్‌లో జరుగుతున్న ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కోసం రూపొందించిన పిచ్‌ల విషయంలో ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో భారీ స్కోర్లు నమోదు కాగా, రెండూ డ్రాగా ముగిశాయి. ఈ నేపథ్యంలో పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ అకీబ్ జావేద్ పిచ్ క్యూరేటర్లపై తీవ్రంగా మండిపడ్డారు. పిచ్‌లను ఎలా తయారు చేయాలనే అంశంపై భారత క్యూరేటర్ల నుంచి నేర్చుకోవాలని సూచించాడు. ‘ పిచ్‌లను ఎలా తయారు చేయాలో ఎక్కడో వెళ్లి నేర్చుకోవడం ఎందుకు? భారత్‌లోని చెన్నై, బెంగళూరు, ముంబైలలోని క్యూరేటర్లను గుర్తించండి. స్పిన్నర్ల ఆధిపత్యం ఉండేలా పిచ్‌లను ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకోండి. మన క్యూరేటర్లు పాక్ ఆధిపత్యం ఉండేలా పిచ్‌లు రూపొందించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటించగా, టీ20తో పాటు టెస్ట్ సిరీస్‌ను భారత్ వైట్‌వాష్ చేసింది. పిచ్‌లు భారత బౌలర్లకు అనుకూలంగా ఉండేలా రూపొందించడంతోనే ఇది సాధ్యమైందని జావేద్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పై సూచన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.