సమంతపై అఖిల్‌కు కోపం.. కారణం ఇదీ - MicTv.in - Telugu News
mictv telugu

సమంతపై అఖిల్‌కు కోపం.. కారణం ఇదీ

April 9, 2022

fbhfdb

హీరోయిన్ సమంతకు టాలీవుడ్‌లో గతంలో ఎప్పుడూ లేని కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. వివరాల్లోకెళితే.. నిన్న అక్కినేని అఖిల్ పుట్టినరోజును పురస్కరించుకొని సమంత ఇన్‌స్టాగ్రాం ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. తన మాజీ వదినకు అఖిల్ కనీసం థ్యాంక్స్ అయినా చెప్తాడు అనుకుంటే అఖిల్ అస్సలు స్పందించలేదు. ఈ విషయంపై చాలా మంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కారణమేంటా? అని చూస్తే అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న ఏజెంట్ చిత్రం ఆగస్టు 12న రానుంది. ఇదే రోజున సమంత నటిస్తున్న యశోద చిత్రం కూడా విడుదల అవుతోంది. విడుదల తేదీని ఇటీవలే ప్రకటించారు. దీంతో ఒకేరోజు మాజీ వదిన, మాజీ మరిదుల మధ్య పోటీ అని సినీ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. తనకు పోటీగా రావడంపై అఖిల్ కోపంగా ఉన్నాడని, అందుకే సమంత పోస్టుకు స్పందించలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదికాక, సమంతకు మరో కొత్త, భారీ సమస్య రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రం కూడా ఆగస్టు 11న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. ఇది గనుక నిజమైతే ఇక రెండు పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న సినిమాల మధ్య సమంత సినిమాను ఏమేరకు అభిమానులు ఆదరిస్తారో చూడాలి.