akkineni akhil comments on samantha health
mictv telugu

అఖిల్ మంచి మనసు.. గొడవలన్నీ పక్కపెట్టి.. సమంతపై సంచలన కామెంట్స్

October 30, 2022

కోటిమందిలో ఒకరికి వచ్చే ‘మయోసిటిస్‌’ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్నా అంటూ నిన్న సమంత పెట్టిన పోస్ట్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. మయోసిటిస్‌ కి ట్రీట్మెంట్ లేదని, ప్రాణాంతక వ్యాధుల్లో ఇది కూడా ఒకటని సోషల్ మీడియాలో అప్పుడే సమంత జబ్బుపై చర్చలు మొదలైపోయాయి. ఈ నేపథ్యంలో సామ్ ఫ్రెండ్స్, ఫామిలీ, సెలబ్రెటీస్, ఫాన్స్ ఇలా అందరు సమంత ఆరోగ్యంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సందర్భంలో ఒక అనుకోని వ్యక్తి సమంతపై ట్వీట్ చేశాడు. ఏ కుటుంబంతో అయితే తెగదింపులు చేసుకుందో అదే అక్కినేని ఫ్యామిలీ నుండి అఖిల్ సమంత అనారోగ్యంపై స్పందించాడు. మయోసిటిస్‌ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌తో బాధపడుతున్న సమంతకి అభిమానుల ప్రేమే బలమంటూ కామెంట్స్ చేశాడు.

యశోద సినిమాకు డబ్బింగ్ చెబుతూ తానూ మయోసిటిస్‌ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌తో బాధపడుతున్నట్లు తెలిపిన సమంత పోస్టుపై అఖిల్ అక్కినేని ఫ్యామిలీ నుండి అందరికంటే ముందే స్పందించాడు. తన ఆరోగ్యం బాలేదని చెప్పగానే.. అక్కినేని ఫ్యామిలీ నుండి మాజీ భర్త నాగచైతన్యనో, లేక నాగార్జుననో స్పందిస్తారనుకుంటే అఖిల్ మొదటగా స్పందించటం కాస్త విచిత్రమైన అంశం. సమంత త్వరగా కోలుకోవాలని హీరో అఖిల్ తన సానుభూతి తెలియజేశాడు. అందరి ప్రేమాభిమానాలు నీకు మరింత బలాన్ని ఇస్తాయి డియర్ సామ్ అంటూ ట్వీట్ చేశాడు. ‘డియర్ సామ్, అందరి ప్రేమాభిమానాలే నీకు మరింత బలాన్నిస్తాయి’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అఖిల్. అయితే సమంత అనారోగ్యంపై మాజీ భర్త నాగ చైతన్య ఎలా స్పందిస్తాడో అన్నది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఏదేమైనా అన్న వదినలు మధ్య విడాకుల వివాదం పక్కన పెట్టి మాజీ వదినకు సంఘీభావం తెలిపి తన గొప్ప మనసు చాటుకునాన్డు అక్కినేని అఖిల్ అంటూ సోషల్ మీడియాలో కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అఖిల్ మంచి మనసుకి నిదర్శనమంటూ అక్కినేని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.