Akkineni Family Ban Balakrishna Shooting In Annapurna Studio
mictv telugu

అన్నపూర్ణలో అడుగు పెట్టొద్దు..!

January 25, 2023

వీరసింహరెడ్డి సక్సెస్ మీట్ నందమూరి అభిమానులని అలరించగా అక్కినేని అభిమానులకి మాత్రం తీవ్ర అవమానం మిగిల్చింది. మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు అని పేరున్న బాలయ్య ఎప్పటిలానే సక్సెస్ ఈవెంట్ లో తన స్పీచ్ తో అదరగొట్టాడు. అయితే ఆఖరిలో కాస్త టంగ్ స్లిప్ కూడా అయ్యాడు. తన తండ్రి ఎన్టీఆర్ ని పొగిడే క్రమంలో.. ఇండస్ట్రీకి దిగ్గజాలైన ఏఎన్నార్, ఎస్వీఆర్ లను తూలనాడాడు. ‘అక్కినేని తొక్కినేని.. ఆ రంగారావు ఈ రంగారావు’ అంటూ కాస్త హార్ట్ అయ్యేలా మాట్లాడాడు. దాంతో అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో బాలయ్యపై విరుచుకుపడుతున్నారు. ‘పాపం.. ఎలా మాట్లాడాలో తెలియదు. ఆయనని అలా వదిలేయండయ్యా’ అని ఇండస్ట్రీ నుండి కామెంట్స్ వస్తున్నా.. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం బాలయ్యని వదలట్లేదు. ఇక అక్కినేని అన్నదమ్ముళ్లు నాగచైతన్య, అఖిల్ లు సైతం బాలయ్య వ్యాఖ్యలని ఖండిస్తూ పోస్టులు పెట్టారు. అయితే ఈ సందర్భంగా మరో సంచలన వార్త ఒకటి అక్కేనని అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

బాలయ్య వివాదంపై ఇప్పటివరకు స్పందించని అక్కినేని పెద్దన్న నాగార్జున షాకింగ్ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. బాలయ్య షూటింగ్స్ ఇకపై ఏవి కూడా అన్నపూర్ణ స్టూడియోలో జరగనివ్వకుండా అక్కినేని కుటుంబం బహిష్కరించారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. నాగార్జున కౌంటర్ ఈ విధంగా ప్లాన్ చేశాడని రూమర్స్ వస్తున్నాయి. బాలయ్యకి సంబంధించిన సినిమాలతో పాటు పలు షోల షూటింగ్స్.. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంటాయి. ప్రస్తుతం బాలయ్య హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో కూడా అక్కడే జరుగుతోంది. ఇక తాజాగా బాలయ్య చేసిన వ్యాఖ్యల వల్ల ఆయన్ని.. స్టూడియోలోకి రాకుండా నిషేధించారనే వార్త వినిపిస్తోంది. మరి ఈ రూమర్ లో నిజమెంతుందో కానీ.. ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 3 పనులు ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలోనే లోనే కొనసాగుతున్నాయి. తోలి ఎపిసోడ్ కి తమిళ బ్రదర్స్ సూర్య, కార్తీలు రానున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఏంజరుగుతుందో.