అక్కినేని నాగచైతన్యకు జరిమానా విధించిన పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

అక్కినేని నాగచైతన్యకు జరిమానా విధించిన పోలీసులు

April 12, 2022

03

సినీ హీరో అక్కినేని నాగచైతన్యకు తెలంగాణ పోలీసులు జరిమానా విధించారు. ఈ రోజు ఉదయం నాగ చైతన్య తన కారులో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద వెళ్తుండగా, ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని ఆపారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉందంటూ రూ. 700 జరిమానా విధించారు. అనంతరం బ్లాక్ ఫిలింను తొలగించారు. కాగా ఈ మధ్యనే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మంచు మనోజ్ కార్లకు పోలీసులు జరిమానా విధించి, బ్లాక్ ఫిలింను దగ్గరుండి తొలగించారు. వై కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తులు తప్ప మిగతావారు ఎవ్వరూ కూడా బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని సుప్రీంకోర్టు గతంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని అనుసరించి పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.

03