నాగార్జున పొలంలో కలకలం.. కుళ్లిపోయిన మృతదేహం  - MicTv.in - Telugu News
mictv telugu

నాగార్జున పొలంలో కలకలం.. కుళ్లిపోయిన మృతదేహం 

September 18, 2019

Akkineni nagarjuja ...

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున పొలంలో మళ్లీ కలకలం రేగింది. షాద్ నగర్ మండలంలో కేశంపేటలోని ఆయన వ్యవసాయ భూమిలో కుళ్లిపోయిన మృతదేహం బయటపడింది. తల భాగం గుర్తుపట్టని విధంగా కేవలం పుర్రెతోనే మిగిలింది. నాగార్జున పాపిరెడ్డి గూడలో 40 ఎకరాల పొలాన్ని కొని వ్యవసాయం చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన ఆయన భార్య అమల అక్కడ మొక్కలు కూడా నాటారు. సేంద్రియ వ్యవసాయం కోసం ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. ఈ క్రమంలో సాగు నిపుణులు అక్కడి ఓ గదిలో మృతదేహాన్ని గుర్తించారు. కొన్ని నెలల కిందటే చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. రేపు అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. కాగా గత ఏడాది కూడా నాగ్ పొలంలో విషాదం చోటుచేసుకుంది. 

ఇదే పొలంలో గత ఏడాది జూన్ లో భార్యాభార్తలైన కూలీలు కరెంట్ షాక్‌తో చనిపోయారు. తూర్పుగోదావరి జిల్లా బొబ్బిడవరం మండలం కొత్తలంకకు చెందిన వెంకటరాజు(36), దుర్గ(32) అక్కడ పనిచేసేవారు. కరెంటు పోవడంతో రాజు ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించడానికి వెళ్లాడు. తెగిపడిన కరెంటువైరు తగిలి చనిపోయాడు. అతణ్ని కాపాడబోయిన దుర్గకూడా మృత్యువాత పడింది.