నాగార్జున పొలంలో దొరికిన డెడ్‌బాడీ ఎవరిదంటే..  - MicTv.in - Telugu News
mictv telugu

నాగార్జున పొలంలో దొరికిన డెడ్‌బాడీ ఎవరిదంటే.. 

September 19, 2019

Akkineni Nagarjuna

నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన పొలంలో కుళ్లిపోయిన మృతదేహం లభించడం కలకలం రేపింది. గతంలోనూ అక్కడ ఇద్దరు చనిపోవడంతో అనేక ఊహాగానాలు వెల్లువెత్తాయి. పోలీసులు తాజాగా బయటపడ్డ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి దర్యాప్తు ప్రారంభించారు. ఆ మృతదేహం ఎవరిదో గుర్తించారు. 

రంగారెడ్డి జిల్లా కేశంపేట్‌ మండలంలోని పాపిరెడ్డిగూడలో నాగార్జునకు చెందిన 40 ఎకరాల పొలంలో సేంద్రియ సాగుకు యత్నాలు చేస్తుండగా ఓ గదిలో నిన్న కుళ్లిన డెడ్ బాడీ కనిపించింది. తల మొత్తం కుళ్లిపోయి పుర్రె మాత్రమే మిగిలింది. పోలీసులు డెడ్ బాడీ ఆనవాళ్లు, అక్కడ దొరికిన పురుగుల మందు సీసా గురించి సమీప గ్రామాల ప్రజలకు వివరించారు. స్థానికుల సమాచారంతో అతణ్ని  పాపిరెడ్డిగూడకే చెందిన పాండుగా గుర్తించారు. పాండు కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది మూడేళ్ల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయాడు. సోదరుడు కిడ్నీవ్యాధితో చనిపోవడం, అప్పులు తీర్చడానికి పొలం అమ్మాల్సి రావడం అతన్ని కలచివేసింది. కష్టాలు భరించలేక నాగార్జున పొలంలోని గదిలోకి వెళ్లి పురుగుల మందు తాగి చనిపోయాడు.