నాగ్ ‘మన్మథుడు 2’ టీజర్‌ విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

నాగ్ ‘మన్మథుడు 2’ టీజర్‌ విడుదల

June 13, 2019

కింగ్ నాగార్జున నటించిన ‘మన్మథుడు’ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. 17ఏళ్ల క్రితం విడుదలైన ఆ సినిమా బాక్స్ ఆఫీస్‌ను బద్దలు కొట్టింది. తాజాగా ‘మన్మథుడు’ సినిమాకు సీక్వెల్ వచ్చేసింది. ‘మన్మథుడు 2’ అంటూ అక్కినేని నాగార్జున మరోసారి అభిమానులను అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ గురువారం విడుదలైంది.

ముదురు వయసులో ఉన్న నాగార్జున పెళ్లి చుట్టూ ఈ కథను అల్లి చాలా కామెడీగా చూపించారు. ‘నీకు షట్టర్లు మూసేసి దుకాణాలు సర్దేసే వయసొచ్చేసింది’ అని నాగ్‌ను ఉద్దేశిస్తూ ప్రముఖ నటి దేవదర్శిని చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలవుతోంది. పెళ్లి చేసుకోకుండా అమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు.టీజర్ చివర్లో నాగార్జున ‘ఐ డోన్ట్‌ ఫాల్‌ ఇన్‌ లవ్‌.. ఐ ఓన్లీ మేక్‌ లవ్’ అని చెప్పై డైలాగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రంలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేశ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో సమంత కూడా అతిథి పాత్రలో కనిపించనుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 9వ తేదీన విడుదల కానుంది. 60ఏళ్ల వయసు చేరువైనా.. 30ఏళ్ల వయసున్నా ఇద్దరు కొడుకులున్నా.. నాగర్జున ఇంకా నిజంగానే నవమన్మథుడిలానే ఉన్నారు.