శ్రీదేవి, రేఖలకు అక్కినేని అవార్డు..  - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి, రేఖలకు అక్కినేని అవార్డు.. 

November 14, 2019

చిత్రసీమలో ప్రతిభావంతులకు అందిస్తున్న ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరావు జాతీయ పురస్కారాలను గురువారం ప్రకటించారు. 2018-19కిగాను దివంగత నటి శ్రీదేవి, ప్రముJ నటి రేఖలను ఎంపిక చేశారు. శ్రీదేవిని ఈ పురస్కారానికి ఎంపిక చేయడం ఇది రెండోసారి. 2013లో ఆమె జీవించి ఉన్నప్పుడు ఈ అవార్డును అందుకున్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా మరణానంతరం మరోసారి ప్రకటించారు. 

Akkineni national awards.

ఈ నెల 17న అన్నపూర్ణ స్టూడియోలో శ్రీదేవి తరఫున భర్త బోనీకపూర్, రేఖలు అవార్డు మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకుంటారు. అన్నపూర్ణ కాలేజీ ఆఫ్‌ ఫిలిం అండ్‌ మీడియా (ఏసీఎఫ్‌ఎం) తృతీయ స్నాతకోత్సవం కూడా ఆ రోజే జరుగుతుందని కమిటీ తెలిపింది. శ్రీదేవి దక్షిణాది చిత్రాల్లో ఒక వెలుగు వెలిగి బాలీవుడ్ కు వెళ్లడం తెలిసిందే. రేఖ కూడా తెలుగు నుంచి టీనేజ్ వయసులోనే బాలీవుడ్‌లోకి వెళ్లి సత్తా చారు.  ఏఎన్‌ఆర్‌ అవార్డులను ఇదివరకు అందుకున్నవారిలో దేవానంద్‌, రాజమౌళి, అంజలీదేవి, వైజయంతిమాల,  లతా మంగేష్కర్, బాలచందర్, హేమమాలిని, శ్యామ్ బెనగల్, అమితాబ్‌బచ్చన్‌ కృష్ణ ఉన్నారు.