100 కేజీలు.. సమంతా నీకిది ఎలా సాధ్యం ! - MicTv.in - Telugu News
mictv telugu

100 కేజీలు.. సమంతా నీకిది ఎలా సాధ్యం !

May 22, 2019

అక్కినేని సమంత.. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. ఫిట్‌నెస్‌కు ప్రాముఖ్యం ఇస్తుంటుంది. శారీరక దృఢత్వానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్లలో సమంత ముందుటూ ఆగ్ర హీరోయిన్‌గా అందరి కళ్లు తనవైపు తిప్పుకుంటుంది. ఆమె వ్యాయామం చేస్తున్న వీడియోలు, ఫొటోలు అనేక సార్లు సోషల్ మీడియాలో పోస్టు చేసి, అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.  తాజాగా మరో వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సామ్ ఔరా అనిపిస్తోంది.

https://www.instagram.com/p/Bxv5H9JAYPQ/?utm_source=ig_web_copy_link

ఈ వీడియోలో సామ్.. 100 కిలోలు లిఫ్ట్ చేసింది. అది చూసిన ఆమె అభిమానులు.. ‘సామ్ న్యూ ఐరన్ లేడీ. అలా ఎలా చేశావ్ సామ్’ అంటూ ఆ వీడియోను షేర్ చేస్తూ.. కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో గురించి సమంత ఫ్రెండ్ మల్లిక మైలవరపు కూడా ఓ ట్వీట్ చేసింది. ‘దేవుడా.. 100 కిలోలా?.. సమంత ఫీస్ట్‌ టు బీస్ట్‌. ఇది ఎలా సాధ్యమైంది?. నిజంగా చెబుతున్నా.. నీలో ఊహించనంత బలం ఇంది’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆ ట్వీట్ చూసిన సమంత నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేసింది.