అవన్నీ పుకార్లే.. అమ్మంటే నాకు చాలా ఇష్టం.. - MicTv.in - Telugu News
mictv telugu

అవన్నీ పుకార్లే.. అమ్మంటే నాకు చాలా ఇష్టం..

May 18, 2019

అక్కినేని సమంత పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. ఇటీవల ఆమె భర్త నాగచైతన్యతో కలిసి నటించిన మజిలీ చిత్రం బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. అంతేకాదు ఈ చిత్రంతో నాగచైతన్య కెరీర్లోనే హయ్యస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిపోయింది.

కాగా సమంతకు ఆమె తల్లికి కొద్దిరోజులుగా పడటం లేదని, అందుకే ఆమెను సమంత దూరం పెట్టిందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. దీనిపై సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. ‘నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి అమ్మ నాకోసం ప్రార్థనలు చేసేది. నాకు ఏం అవసరం వచ్చిన అమ్మే చూసుకునేది. అమ్మ నాకు రెండో దేవత. అలాంటి అమ్మకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను’ అంటూ తన తల్లి ఫోటోలను ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.