గాసిప్ ఎఫెక్ట్: సెట్‌లో కొట్టుకున్న అక్షయ్, డైరెక్టర్ - MicTv.in - Telugu News
mictv telugu

గాసిప్ ఎఫెక్ట్: సెట్‌లో కొట్టుకున్న అక్షయ్, డైరెక్టర్

November 13, 2019

నటీనటులపై మీడియా సంస్థలు గాస్సిప్స్ రాయడం సహజమే. కొన్ని సార్లు గాసిప్స్ మరీ మితిమీరి పోతాయి. తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి ఓ గాసిప్‌ను ఓ ప్రముఖ మీడియా సంస్థ వెబ్‌సైట్‌లో రాసింది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సూర్యవంశీ’ సినిమాలో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి మధ్య గొడవ జరిగిందని, ఇద్దరూ మాట్లాడుకోకపోవడంతో కరణ్ జోహార్ వారిద్దరి మధ్య రాజీ చేశారని ఓ ప్రముఖ వెబ్‌సైట్‌లో వార్త వచ్చింది. దీంతో ఆ మీడియా సంస్థకు వారిద్దరూ గట్టి కౌంటర్ ఇచ్చారు. 

అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి షూటింగ్ స్పాట్‌లోనే కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకున్నారు. పోలీసులు వచ్చి వారిని విడదీశారు. మీడియాలో వచ్చిన ఓ గాసిప్‌నకు వీరిద్దరూ కలిసి ఇలా నటించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘బ్రేకింగ్ న్యూస్.. అక్షయ్, రోహిత్ మధ్య గొడవ.. లైవ్‌లో చూడండి..’’ అంటూ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఇంట్రో చెప్పిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నకిలీ వార్తలు రాసే మీడియా సంస్థలకు ఇది గట్టి కౌంటర్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.