బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అందరికీ తెలుసు. అతను ఏది చేసినా కొత్తగా చేయాలనుకుంటాడు. అందుకే మూడు నిమిషాల్లో 184 సెల్ఫీలు తీసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో తను స్థానం సంపాదించాడు.
హీరోలు సినిమాల కోసం స్టంట్స్ చేస్తుంటారు. ఇంకా ఏవేవో పనులు చేస్తారు. కానీ నిజజీవితంలో మనలాగే మామూలుగా ఉండాలనుకునే వాళ్లే ఎక్కువ. అయితే కొందరు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచిస్తుంటారు. అందులో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అగ్రస్థానంలో నిలుస్తాడు.
రికార్డు ఎలా..?
అక్షయ్ కుమార్ తన సుదీర్ఘమైన కెరీర్ లో అనేక బాక్సాఫీస్ హిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ నటుడు మరో నటుడి గిన్నిస్ రికార్డులను బద్దలు కొట్టాడు. అవును మీరు చదువుతున్నది నిజం. తను రాబోయే చిత్రం సెల్ఫీ ప్రమోషన్ కోసం ముంబైలో ఒక ఈవెంట్ లో ఈరోజున ఉదయం పాల్గొన్నాడు. అక్కడ 3 నిమిషాల్లో 184 సెల్ఫీలను తీసి రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు 2015లో హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ లండన్ లో తన కొత్త చిత్రం శాన్ ఆండ్రియాస్ ప్రీమియర్ లో మూడు నిమిషాల్లో 105 సెల్ఫీలు క్లిక్ చేసి రికార్డు సంపాదించాడు.
ఆ తర్వాత 2017లో జేమ్స్ స్మిత్ 168 సెల్ఫీలతో అతని రికార్డును తిరగరాస్తే.. అక్షయ్ 184 సెల్ఫీలతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సంపాదించాడు.
అక్షయ్ కుమార్ చివరగా రామ్ సేతు సినిమాలో కనిపించాడు. ఈ సినిమాలో అక్షయ్, ఇమ్రాన్ హష్మీ కలిసి నటించారు. ఈ సెల్ఫీ చిత్రం ఫిబ్రవరి 24న థియేటర్లలో విడుదల కానుంది. ఇది 2019 మలయాళ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్ కి రీమేక్.