అక్షయ్ ఆదాయం రోజుకు అక్షరాల కోటి.. ప్రపంచంలో నం.6 - MicTv.in - Telugu News
mictv telugu

అక్షయ్ ఆదాయం రోజుకు అక్షరాల కోటి.. ప్రపంచంలో నం.6

August 12, 2020

Akshay Kumar only Bollywood star among Forbes’ highest-paid actors of 2020.

ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచవ్యాప్త టాప్-10 నటుల జాబితాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ స్థానం సంపాదించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పారితోషికాన్ని తీసుకుంటున్న నటుల్లో అక్షయ్ ఆరో స్థానంలో నిలిచారు. అక్షయ్ 2019-2020 మధ్యకాలంలో రూ. 362 కోట్ల పారితోషకం తీసుకున్నాడు. ఈ జాబితాలో చోటు లభించిన ఏకైక బాలీవుడ్ నటుడు అక్షయ్ కావడం గమనార్హం. 

ఈ జాబితాలో హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్(రాక్) మొదటి స్థానంలో నిలిచాడు. వరుసగా రెండవసారి డ్వేన్ జాన్సన్ అగ్రస్థానంలో నిలిచాడు. డ్వేన్ జాన్సన్ తరువాత ర్యాన్ రేనాల్డ్స్, మార్క్ వాహ్లెబెర్గ్, బెన్ అఫ్లెక్, విన్ డీజిల్ తొలి అయిదు స్థానాల్లో నిలిచారు. మాన్యుయెల్ మిరాండా, విల్ స్మిత్, ఆడం శాండ్లర్, జాకీచాన్ టాప్ టెన్ జాబితాలో ఉన్నారు. గత సంవత్సర కాలంగా అక్షయ్ కుమార్ నటించిన మిషన్ మంగళ్, హౌస్‌ఫుల్-4 భారీ విజయం సాధించాయి. ప్రస్తుతం అక్షయ్ కుమార్ ‘లక్ష్మి బాంబ్’, ‘ప్రిథ్వీరాజ్’, ‘సూర్యవంశీ’, ‘ఆత్రంగీరే’ సినిమాల్లో నటిస్తున్నారు.