100 మందిలో భారత్ నుంచి కిలాడీ ఒక్కడే - MicTv.in - Telugu News
mictv telugu

100 మందిలో భారత్ నుంచి కిలాడీ ఒక్కడే

June 5, 2020

Akshay Kumar Placed in Forbes 2020 List

ప్రపంచంలోనే అత్యధిక రాబడి కలిగిన కుబేరుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈసారి టాప్ 100 లోపు అత్యధికంగా అర్జిస్తున్న సెలబ్రెటీలలో భారత్ నుంచి ఒక్కరికే చోటు దక్కింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌కు మాత్రమే నిలిచాడు. ఆయన ఆదాయం ఈ ఏడాది రూ.366 కోట్ల సంపాదనతో రికార్డు సృష్టించాడు. జూన్‌ 2019 నుంచి మే 2020 వరకు రాబడిని లెక్కగట్టి  ఈ వివరాలను ప్రకటించారు. అమెజాన్‌ ప్రైమ్‌తో అక్షయ్‌ కుమార్‌ డిజిటల్‌ సిరీస్‌లోకి ప్రవేశించడం కారణంగానే ఫోర్భ్స్‌లోకి ఎక్కినట్టుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. 

ఈ ఏడాది కిలాడీ 52వ స్థానానికే పరిమితం అయ్యాడు. గత ఏడాది 33 వ స్థానంలో ఉన్న ఆయన 19 ర్యాంకుల వెనక్కి వెళ్లాడు. అయినా కూడా భారత్ నుంచి ఈ ఒక్కడే 100లో చోటు దక్కించుకోవడం విశేషం. కాగా కాస్మాటిక్‌ ప్రపంచ రారాణి కైలీ జెన్నర్‌ మొదటి స్థానంలో నిలిచారు. ఏడాదిలో రూ 4,453 కోట్ల ఆర్జనతో అగ్రస్థానంలో ఉన్నారు.టాప్‌ 10 అత్యధిక రాబడి కలిగిన సెలబ్రిటీల జాబితాలో కైలీ జెన్నర్‌, కన్యే వెస్ట్‌, రోజర్‌ ఫెదరర్‌, లియోనెల్‌ మెస్పీ, టేలర్‌ పెర్రీ సహ పలువురు చోటు దక్కించుకున్నారు.