సల్మాన్ - అక్షయ్ ల మధ్య టాయ్ లెట్ ! - MicTv.in - Telugu News
mictv telugu

సల్మాన్ – అక్షయ్ ల మధ్య టాయ్ లెట్ !

July 1, 2017


అక్షయ్ కుమార్ వర్క్ విషయంలో చాలా డెడికేటెడ్ పర్సన్ అని ఇదివరకే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కితాబిచ్చాడు. సల్మాన్ ప్రశంసతో మొద్దుబారిపోయాడా అని ‘ టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథా ’ యూనిట్ మీద ఆయన అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే టాయ్ లెట్ సినిమా ఆగస్ట్ 11 కు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసారు. కానీ అక్షయ్ ప్రమోషన్ కు హాజరు కావడంలేదని గుసగుసలాడుకుంటున్నారు. కానీ అక్షయ్ సల్మాన్ మెప్పును ఇంకాస్త బలోపేతం చేస్కునే పనిలో ఇంకా కసిగా వున్నాడనిపిస్తోంది.

‘ ఏడాదికి మూడు సినిమాలు చేసే అక్షయ్, ఏడాదికి ఒక సినిమా చేసే మాకన్నా చాలా గ్రేట్ ’ అన్నాడు కదా.. ఇప్పడు నాలుగు లేదా ఐదు సినిమాలు చేసి సల్మాన్ తో ఇంకా మెప్పు పొందాలనే తహతహలో వుండి ‘ ఖిలాడి ’ సినిమా షూటింగ్ నిమిత్తం లండన్ లో వున్నాడట. ఈ మంత్ ఎండింగ్ ఇండియా వచ్చి అప్పుడు టాయ్ లెట్ సినిమా ప్రమోషన్ లో పాల్గొంటుండొచ్చు.

ఈ విధంగా గనక అక్షయ్ సినిమా షూటింగుల్లో బిజీగా వుంటే ఇంక ప్రమోషన్లకు ఆయనను నమ్ముకోవడం కుదరని పనే. షూట్ అప్పుడే తెలివిగా ఆయన చేత ప్రమోషన్ వీడియోలు కూడా షూట్ చేసేస్కొని రిలీజ్ అప్పుడు వాడుకుంటే సరిపోతుంది.