వరద బాధితులకు అక్షయ్ 2 కోట్ల ఆర్థికసాయం - MicTv.in - Telugu News
mictv telugu

వరద బాధితులకు అక్షయ్ 2 కోట్ల ఆర్థికసాయం

August 15, 2020

Akshay Kumar to Donate Rs 1 Crore Each to Assam and Bihar CM Relief Fund for Flood Victims

కరోనాలో తనవంతు బాధ్యతగా సాయం అందించి రియల్ హీరో అనిపించుకున్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. తాజాగా ఆయన మరోమారు తన హీరోయిజాన్ని ప్రదర్శించారు. గత నాలుగు రోజులుగా కుర్తుస్తున్న భారీ వర్షాలకు బిహార్, అసోం రాష్ట్రాలు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు అక్షయ్ కుమార్ ముందుకు వచ్చారు. బిహార్, అసోం రాష్ట్రాల ముఖ్యమంత్రుల రిలీఫ్ పండ్‌కు రూ.కోటి చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఇదిలావుండగా వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. 

కాగా, అక్షయ్ కుమార్ గతంలో రూ.25 కోట్ల కరోనా సాయం అందించిన విషయం తెలిసిందే. అలాగే కరోనాపై పోరాటం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం అక్షయ్ కుమార్ మరోమారు   ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.3 కోట్ల సాయం అందించారు.