డ్రగ్స్ కేస్ లో ఆకున్ స్టేట్ మెంట్ - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్స్ కేస్ లో ఆకున్ స్టేట్ మెంట్

August 11, 2017

డ్రగ్స్ కేస్ లో గ్లామర్ పార్ట్ సిట్ విచారణ పూర్తి అయిన సంగతి తెల్సిందే. తర్వాత వాటికి సంబంధించి ఎలాంటి ప్రకటన బయటికి రాలేదు. ఇన్ని రోజుల తర్వాత అకున్ సబర్వాల్ ఒక ప్రకటన విడుదల చేసారు.
ఇది సినిమా వాళ్ళ విచారణ కాదు అని ఇన్ డైరెక్టుగా చెప్పిన ఆకున్ సెకండ్ పార్ట్ విచారణ సెప్టెంబర్ లో మొదలు పెడతామని అన్నారు.

సెకండ్ విచారణకు మళ్ళీ వేరే లిస్ట్ ఉంది అని, మాపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేసారు. అలాగే 11 కేసు ల చార్జిషీట్ తొందరగా నే కోర్టులో వేస్తాం. Fsl రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాం.
ఆ రిపోర్టు రాగానే ఛార్జ్ షీట్లు వేస్తాం. కొంత మంది నుంచి శాంపిల్స్ సేకరించాం వాటి తాలూకు రిపోర్టులు వస్తాయి. వచ్చాక తక్షణ చర్యలు వుంటాయి. సెప్టెంబర్ లోగా చార్జిషీట్లు వేస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసు ప్రహసనం పబ్లిగ్గా జరగడం వల్ల సెలెబ్రిటీలకు తల వంపులు వచ్చాయనే వాదన బలంగా వినిపించింది. మరిప్పుడు ఈ తదుపరి ప్రహసనం ఎలా జరుగుతుందో చూడాలి మరి. మామీద ఎలాంటి ఒత్తిళ్ళు లేవని అంటున్నఅకున్ సబర్వాల్ స్టేట్ మెంట్ వెనుక ఏదో వుందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.