పూరీతో ప్రారంభం.. ముగింపేంటో ? - MicTv.in - Telugu News
mictv telugu

పూరీతో ప్రారంభం.. ముగింపేంటో ?

July 18, 2017

టాలీవుడ్ డ్రగ్స్ లింకును బయట పెట్టేందుకు సిట్ అధికారులు రెడీ అయ్యారు. NDPS యాక్ట్ ప్రకారం నోటీసులు జారీ చేశారు. మొదటగా పూరీని విచారించేందుకు సిద్ధమయ్యారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డ్రగ్స్ ధందాను ఎలా డైరెక్ట్ చేసారో తేల్చనున్నారు. సిట్ అధికారులకు సహకరించకపోతే ఏం చేస్తారో విచారణ ఎలా వుండబోతోందనేది ఉత్కంఠ నెలకొంది. ఫిలింనగర్ కు నెత్తికెక్కిన నిషాను దింపేందుకు ఎక్సైజ్ ఎంఫోర్స్ మెంట్ సిట్ ఆయుధాలను సిద్ధం చేస్కుంది. 12 మందిని ఈ నెల 19 నుండి 29 వ తేదీ వరకు విచారిస్తామని తెలిపింది.

అందుకు ప్రొఫార్మ రెడీ చేసింది. కొన్ని ప్రశ్నలను సిద్ధం చేస్కున్నట్టు తెలిస్తోంది. డ్రగ్స్ వాడినట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న సినిమా పెద్దల్లను విఐపీలుగా చూస్తామని ఎక్సైజ్ కమీషనర్ తెలిపారు. థర్డ్ డిగ్రీ లాంటిది ప్రయోగించకుండా మర్యాదగా చూస్కుంటామని స్పంష్టం చేసారు. వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసారు. బుధవారం డైరెక్టర్ పూరీతో విచారణ మొదలౌతుంది. నలుగురు సిట్ అధికారులు విచారిస్తారు. ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరిండెంట్ శీలం శ్రీనివాసరావు, ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ తో పాటు, సూపరిండెంట్ విజయ్ కుమార్ తో పాటు, ఓ మహిళా అధికారిణి విచారణలో పాల్గొంటారు.

వీరు చేసే దర్యాప్తునంతా వీడియో రికార్డు చేస్తారు. మొదటి దశలో పేరు, నివాసం, తల్లిదండ్రులు, జన్మస్థలం వంటి సమాచారం సేకరిస్తారు. రెండవ దశలో మధ్యపానం, సిగరెట్ల వంటి అలవాట్లపై లైఫ్ స్టైల్ పై వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత సిట్ డైరెక్టర్ అకున్ రంగంలోకి దిగుతారని సమాచారం. అప్పుడే క్రాస్ ఎగ్జామినింగ్ వుంటుంది. డ్రగ్స్ లో కీలక నిందితుడైన కెల్విన్ పూరీకి ఎలా పరిచయమో తెలుసుకుంటారు. ఆ పరిచయం ఎవరి వల్ల జరిగిందని ఆధారాలు రాబట్టుతారు. ఎన్నిసార్లు కెల్విన్ ను కలిసారు, ఎక్కడెక్కడ కలిసారో ప్రశ్నిస్తారు. కలిసిన సమయంలో కెల్విన్ తో ఎవరెవరున్నారు, పూరీ కెల్విన్ దగ్గర డ్రగ్స్ ను కొనుగోలు చేసారా ? ఇప్పటివరకు ఎంత మొత్తంలో డ్రగ్స్ కొనుగోలు చేసారు ?

LST కోసం కెల్విన్ ను సంప్రదిస్తే కొకైన్ లాంటి వాటికోసం ఎవరిని సంప్రదించారు ? డ్రగ్స్ కొనుగోలు తర్వాత కెల్విన్ కు డబ్బులు ఎలా ట్రాన్స్ ఫర్ చేసారు ? ఇప్పటివరకు ఎంత మొత్తంలో డబ్బు ట్రాన్స్ ఫర్ అయింది ? కెల్విన్ దగ్గర డ్రగ్స్ కొనుగోలు సమయంలో సేఫ్ గా ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నారు ? కెల్విన్ ద్వారా జిషన్ పరిచయాన్ని ఎలా ఉపయోగించుకున్నారు ? గోవాకు వెళ్ళినప్పుడు జిషన్ దగ్గర ఎన్నిసార్లు డ్రగ్స్ తీస్కున్నారు ? డ్రగ్స్ మీకు ఎప్పటినుండి అలవాటు వుంది ? మీ దగ్గరనుండి ఎవరెవరికి డ్రగ్స్ ఇస్తారు ? పూరీ డిపార్టుమెంటులో వున్నవారి పేర్లు ? సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకంలో హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు ఎవరున్నారు ? డ్రగ్స్ విషయంలో ఏ కొరియర్ సర్వీస్ ఎక్కువగా మీకు సేవలు అందించింది ? విదేశాలకు ఎన్నిసార్లు టిక్కెట్లు బుక్ చేశారు ? బుక్ చేసిన టికెట్లలో ఎవరెవరిని విదేశాలకు పంపించారో వారి పేర్లు ? డ్రగ్స్ కోసం డ్రైవర్లను ఎక్కడెక్కడికి పంపించారనే అంశాలు ? నెలకు ఎన్నిసార్లు డ్రగ్స్ తీస్కునేవారు ? వంటి చాలా ప్రశ్నలతో సమాచారాన్ని రాబట్టనున్నారు.

కెల్విన్ కాల్ డేటా సమయాన్ని బట్టి సిసి కెమెరాలను పరిశీలించనున్నారు. మీకు ఛార్మి, ముమైత్ ఖాన్, రవితేజ, సుబ్బరాజులతో ఎన్నిరోజుల్నుంచి స్నేహం ? రక్త నమూనాను తీస్కునేందుకు మీరు ఒప్పుకుంటారా ? అనే అంశాలను పరిశీలిస్తారు. ఈ మొత్తం దర్యాప్తును వీడియో రికార్డులో భద్ర పరచనున్నారు. ఎప్పటికప్పుడు అతని ముఖ కవళికలను అతను చెప్పేది నిజమా, అబద్దమా అనే కోణంలో పరిశీలిస్తారు. ఆ తర్వాత అతని సెల్ ఫోన్ పై నిఘా వుంచనున్నారు. పూరీ ఎలాంటి సమాధానాలు చెప్తాడు అనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొనివుంది. పూరీ తర్వాత ఛార్మీ వంతు వుంది. ఆ తర్వాత వన్ బై వన్ విచారణకు రావాల్సి వుంటుంది !