బాగ్దాదీ అండర్‌వేర్‌లను దొంగిలించిన అమెరికా  - MicTv.in - Telugu News
mictv telugu

బాగ్దాదీ అండర్‌వేర్‌లను దొంగిలించిన అమెరికా 

October 29, 2019

Al-Baghdadi's underwear stolen and DNA tested before US raid

కరడుగట్టిన ఉగ్రవాది అబూ బకర్ అల్ బాగ్దాదీని మట్టుబెట్టిన అమెరికా పకడ్బందీ పథకంతో ఆ పని పూర్తి చేసింది. బాగ్దాదీని చంపేశామని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పి నవ్వులపాలైన అగ్రదేశం ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకు సాగింది. అతని ఆచూకీని, చావును పక్కగా ధ్రువీకరించడానికి ‘చెడ్డీ’ ఆపరేషన్ కూడా పూర్తి చేసింది. దీని కోసం సిరియా ఏజెంట్లను నియమించుకుంది. 

సిరియన్ కుర్దూ బలగాలల్లో పనిచేస్తున్న ఐసిస్ ఉగ్రవాదిని అమెరికా సైన్యం అండర్ కవర్ ఏజంట్‌గా మార్చుకుంది. అతడు బాగ్దాదీ అడ్డాపై దాడికి ముందు సీక్రెట్ పని చేశాడు. బాగ్దాదీకి చెందిన రెండు డ్రాయర్లను ఎత్తుకెళ్లి అమెరికా సైన్యానికి అందించాడు. సైన్యం దాని సాయంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించింది. బాగ్దాదీ ఎక్కువ కాలం ఒకే చోట ఉండకపోవడంతో అతని ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారింది. అండర్ కవర్ ఆపరేషన్ల ద్వారా బాగ్దాదీ ఆచూకీ కనిపెట్టిన సైన్యం ‘అతడు బాగ్దాదీనే’ అని నిర్ధారించుకోడానికి డ్రాయర్ డీఎన్ఏతో సరిపోల్చుకుంది. అవి సరిపోలడంతో ఉగ్రస్థావరంపై దాడి చేసి హతమార్చింది.