Al-Qaeda chief died in US drone strike in kabool
mictv telugu

అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరి హతం.. కన్ఫార్మ్ చేసిన బైడెన్

August 2, 2022

 

కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా డ్రోన్ దాడిచే చంపేసింది. ఆదివారం రాత్రి కాబూల్‌లో తన ఇంటి బాల్కనీలో ప్రవేశించిన జవహరిని నిఘా వర్గాల సహాయంతో పకడ్బందీ ప్రణాళికతో తుదముట్టించింది. దీనిని అటు తాలిబన్ ప్రభుత్వం, ఇటు అమెరికా రెండూ ధృవీకరించాయి. సెప్టెంబర్ 11, 2001 లో అమెరికాలోని ట్విన్ టవర్స్‌పై జరిగిన దాడిలో అప్పటి అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ప్రధాన సూత్రధారి కాగా, జవహరి అతనికి సహాయం చేశాడు. లాడెన్‌ను ఎప్పుడో హతమార్చిన అమెరికాకు జవహరిని చంపడానికి మాత్రం ఇంతకాలం పట్టింది. లాడెన్ తర్వాత అల్‌ఖైదా బాధ్యతలను స్వీకరించిన జవహరి తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డు ఉంది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. అమెరికాకు హాని తలపెట్టేవారు ఎక్కడున్నా, ఎంత దూరమున్నా వదిలిపెట్టమని హెచ్చరించారు. ఉగ్రవాదంపై ఇదొక విజయవంతమైన చర్య అని సమర్ధించుకున్నారు.