Home > Featured > మీ దేశంపై యుద్ధం చేయండి.. భారత ముస్లింలకు అల్‌ఖైదా పిలుపు 

మీ దేశంపై యుద్ధం చేయండి.. భారత ముస్లింలకు అల్‌ఖైదా పిలుపు 

Al Qaeda urges Indian Muslims

భారత్‌పై ప్రపంచ నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా మరోసారి దాడులకు కుట్ర పన్నుతోంది. మీ దేశంపై దాడులు చేయాలంటూ భారత ముస్లింలకు పిలుపునిచ్చింది. భారత ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటోందని, అందుకు ప్రతీకారంగా ఉగ్రదాడులు చేయాలంటూ కశ్మీర్‌లోని మిలిటెంట్లకు సూచించింది. యెమెన్‌లో అల్ ఖైదా అనుబంధ సంస్థ అల్ ఖైదా అరబ్ పెవిన్సులా (ఏక్యూఏపీ)ఈ ప్రకటన విడుదల చేసింది. అల్‌‌ఖైదా ఇచ్చిన పిలుపు ఇప్పుడు సంచలనంగా మారింది.

ముస్లింలపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధంలో భారత్ కూడా ఒక భాగమేనని అభిప్రాయపడింది. తబ్లిగీ జమాత్ పై విష ప్రచారం చేస్తూ వైరస్ వ్యాప్తి చేశారని అసత్య ఆరోపణలు చేసి ముస్లింలపై వ్యతిరేకత చూపిస్తున్నారని పేర్కొంది. భారత్‌లోని ముస్లింలంతా ఏకమైఆయుధాలు చేపట్టి జీహాద్‌లో పాల్గొనాలని కోరింది. ముస్లింలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించిన కొన్ని రోజులకే ఈ విధమైన ప్రకటన రావడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కరోనాతో భారత్ పోరాటం చేస్తున్న సమయంలో దీన్నే అదునుగా చూసుకొని పాకిస్థాన్ ఉగ్రవాదులను దేశంలోకి చొప్పిస్తోంది. ఈ క్రమంలో అల్‌ఖైదా వ్యాఖ్యలపై ఏ విధంగా భారత్ సమాధానం ఇస్తుందనేది తెలియాల్సి ఉంది.

Updated : 5 May 2020 3:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top