అల్లు అర్జున్ నటిస్తున్న ‘అల.. వైకుంఠపురములో’ సినిమాకు సంబంధించిన మరో పాట టీజర్ విడుదలైంది. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఓ మైగాడ్ డాడ్ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన టీజర్ వచ్చేసింది. ఈ పాట టీజర్‌ను బన్నీ కొడుకు,కూతురు స్టెప్పులు వేస్తుండగా వీడియో తీసి రిలీజ్ చేశారు. ఇది చూసిన వారంతా చాలా క్యూట్‌గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ పాటకు తమన్ స్వరాలు అందించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ‘ఓ మైగాడ్ డాడీ’ అంటూ సాగే పూర్తి పాట ఈ నెల 22న విడుదల చేయనున్నారు. పాట విన్న అభిమానులు చాలా క్యూట్‌గా ఉందంటూ చెబుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.