టాలీవుడ్ ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఆమె నటించిన ‘జయమ్మ పంచాయతి’ సినిమా శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలై, మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో సుమకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. వీడియోను వీక్షిస్తున్న నెటిజన్స్ ‘అయ్యో సుమా..పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డావు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
జయమ్మ పంచాయతీ షూటింగ్ సందర్భంగా సుమ ఓ నీటి ప్రవాహం వద్ద రాతిపై నిల్చుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా కాలు జారి కిందపడింది. కిందపడిన ఆమెకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో, అక్కడున్న అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.