అయ్యో రాంచరణ్‌ను విలన్ చేశారు..వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యో రాంచరణ్‌ను విలన్ చేశారు..వీడియో వైరల్

March 26, 2022

 bbb

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఈ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌, రాంచరణ్‌ తమ నటనలతో అభిమానుల మతి పొగొట్టారు. ఈ సందర్భంగా సినిమాలో ఇద్దరు హీరోల మధ్య స్నేహంతో పాటు, కొన్ని సందర్భాలలో ఫైట్‌ సీన్స్‌ కూడా ఉన్నాయి. ఈ సన్నివేశాలు చూసినప్పుడు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకుంటే, ఓ రాంచరణ్ అభిమాని మాత్రం వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. ఓ థియేటర్‌లో ఫ్యామిలీతో కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూస్తుండగా ఓ బాలుడు ఎన్టీఆర్‌ రామ్‌చరణ్‌ను కొట్టే సీన్‌ రావడంతో వెక్కివెక్కి ఏడ్చాడు. ఉట్టి పుణ్యానికే తమ అభిమాన హీరోను కొడుతున్నాడంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాం చరణ్‌ ఏం చేయలే, అయినా కొడ్తున్నాడు, ఆయనను విలన్‌ చేశారంటూ తెగ బాధపడ్డాడు. దీంతో నవ్వాపుకోలేకపోయిన అతడి ఫ్యామిలీ వాళ్లిద్దరూ మళ్లీ ఫ్రెండ్స్‌ అవుతారు, అలా ఏడవద్దంటూ ఆ బుడ్డోడికి నచ్చజెప్పారు. దీంతో ఆ బాలుడు ఏడ్పును ఆపేశాడు