నూకలున్నాయ్.. ఒకరు మంచులో 23 రోజులు, మరొకరు అడవిలో 21 రోజులు - MicTv.in - Telugu News
mictv telugu

నూకలున్నాయ్.. ఒకరు మంచులో 23 రోజులు, మరొకరు అడవిలో 21 రోజులు

January 14, 2020

Australia.

భూమ్మీద తినడానికి నూకలు ఉండాలి కానీ, మృత్యువు కూడా తోక ముడుచుకుని పారిపోతుంది. అలాంటోళ్లు చావుకు సవాల్ విసిరి మృత్యుంజయులు అనిపించుకుంటారు. ముంచుకువచ్చే ఏ ప్రమాదమూ వారిని టచ్ చేయలేదు. ‘వాడికి రోజులింకా ఉన్నాయ్.  మనం వాణ్ని ఏమీ చేయలేం’ అని పంచభూతాలు వెనక్కి వెళ్లిపోతాయి. ఇందుకు ప్రత్యక్ష సాక్షంగా నిలుస్తున్నారు ఈ ఇద్దరు మృత్యుంజయులు.

హెలికాప్టర్ కూలి, గడ్డకడుతూ..

టైసన్ స్టీలే(30) అనే వ్యక్తి అలస్కాలోని అంకోరేజ్‌కి 112 కిలోమీటర్ల దూరంలో మంచు పర్వతాల్లో చిక్కుకున్నాడు. అతను ప్రయాణించిన హెలికాప్టర్ క్యాబిన్ ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని, మైనస్ డిగ్రీల మంచులో కూలిపోయింది. ప్రాణాలతో బయటపడ్డ టైసన్.. ఎలాంటి ప్రదేశంలో పడ్డాడో తెలుసుకుని షాకయ్యాడు. ఎలాగైనా బతకాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. క్యాబిన్ కింద ఓ గొయ్యిలా చేసుకుని, దానికి చుట్టూ కార్డ్ బోర్డ్ అట్టల్ని పెట్టాడు. చిన్న షెల్టర్‌లా మార్చుకుని అందులోనే 23 రోజులు ఉన్నాడు. హెలికాప్టర్‌లో ఉన్న ఆహారంలో చాలా వరకూ కాలి బూడిదవగా… కొంత ఆహారమే తింటూ క్షణమొక యుగంగా గడిపాడు. 

SURVIVOR

On Thursday, January 9, Helo 3 responded to a request for a welfare check on Tyson Steele, age 30, at his remote homestead approximately 20 miles outside of Skwentna. He had not been heard from for several weeks. Late that morning, Helo 3 pilot Cliff Gilliland and Tactical Flight Officer Zac Johnson located Steele waving his arms near a makeshift shelter. An SOS signal was stamped in the snow outside. His cabin had burned down in mid-December killing his dog and leaving him stranded in subzero temperatures with no cabin, and no means of communication, for 23 days. Read the story in his own words athttps://dps.alaska.gov/getmedia/4d477f96-1d92-4082-8ec9-76dd97580108/Winter-Fire-Survivor_1-10-2020

Publiée par Alaska State Troopers (Official) sur Vendredi 10 janvier 2020

అక్కడ ఎలాంటి కమ్యూనికేషనూ లేదు. చుట్టూ కొండలు, నదులు, అడవులు, సరస్సులు. 32 కిలోమీటర్లు వెళ్తే తప్ప బతికే అవకాశాలు లేవు. వాటిని ఎక్కుదామంటే… క్షణక్షణానికీ వాతావరణం భయంకరంగా మారిపోతోంది. అతి కష్టమ్మీద ఓ మంటను సృష్టించి… అది ఆరిపోకుండా చేసుకున్నాడు. గత వారం స్టేట్ ట్రూపర్స్ అనుకోకుండా అటుగా వెళ్లారు. అక్కడ SOS అని మంచులో రాసి ఉంచిన అక్షరాలు వాళ్లకు కనిపించాయి. SOS అంటే నేను ప్రమాదంలో ఉన్నాను.. నన్ను కాపాడండి అని అర్థం. దీంతో వెంటనే స్టేట్ ట్రూపర్లు అతన్ని కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఈ ప్రమాదంలో టైసన్‌ పెంచుకుంటున్న 6 ఏళ్ల కుక్క మంటల్లో చిక్కుకుని చనిపోయింది. ఇతని పరిస్థితిని చూస్తే మనకు హాలీవుడ్‌లో వచ్చిన ‘కాస్ట్ అవే’ సినిమా గుర్తుకువస్తుంది. ఆ సినిమాలో కథానాయకుడు టైసన్ మాదిరే మంచుకొండల్లో చిక్కుకుంటాడు.

 

పళ్లే బతికించాయి..

మరో ఘటనలో మృత్యుంజయుడైన ఆస్ట్రేలియాకు చెందిన లెమిక్ గురించి మాట్లాడుకోవాలి. అతను క్వీన్స్‌లాండ్‌లోని డైంట్రీ అటవీప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు డిసెంబర్ 22న అతని వాహనం బోల్తా పడింది. అప్పటి నుంచి లెమిక్‌ అదృశ్యమయ్యాడు. లెమిక్‌ అదృశ్యమైన అటవీ ప్రాంతానికి సముద్రం దగ్గరగా ఉంది. అక్కడ కొన్ని వేళ మొసళ్లు జీవిస్తున్నాయి. దీంతో లెమిక్‌ వాటికి ఆహారం అయ్యుంటాడని అందరూ భావించారు.  అటవీ అధికారులు అతని కోసం రెండు వారాలు గాలించినా ఫలితం లేకపోవడంతో తమ ప్రయత్నాన్ని మానుకున్నారు. అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. అయితే అదృష్టవశాత్తు సోమవారం లెమిక్‌ వాహనం బోల్తా పడిన ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో అతను బతికే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మూడు వారాల పాటు అడవిలోనే చిక్కుకున్న అతని ఆరోగ్యం, మానసిక స్థితి బాగానే ఉందని పోలీసులు వెల్లడించారు. మూడు వారాల పాటు అడవిలో అతను  బెర్రీ, ఇతర పండ్లు తిని జీవించాడని పోలీసులు వెల్లడించారు. భలే మృత్యుంజలు కదూ వీళ్లు.