మమ్మల్ని గెలిపిస్తే మద్యంపై 50% డిస్కౌంట్, మేక ఫ్రీ - MicTv.in - Telugu News
mictv telugu

మమ్మల్ని గెలిపిస్తే మద్యంపై 50% డిస్కౌంట్, మేక ఫ్రీ

April 17, 2019

దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు తాయిలాలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన ఓ రాజకీయ పార్టీ తన మేనిఫెస్టోతో అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఇంత వరకు ఏ పార్టీ కూడా ప్రకటించడానికి సాహసం చేయని వరాలను ప్రకటించి సంచలనం సృష్టించింది. సంజి విరాసత్‌ పార్టీ ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే మద్యంపై 50 శాతం డిస్కౌంట్‌ ఇవ్వడంతో పాటు ముస్లింలకు ఈద్‌ పండగ రోజున ఉచితంగా మేకల పంపిణీ, మహిళలకు ఉచితంగా బంగారం వంటి పలు హామీలను చేర్చింది.

Alcohol at half rate, free goat on Eid: Sanjhi Virasat Party's poll promise to Delhi voters will make your mouth water

ఇక ఈ పార్టీ ఈశాన్య ఢిల్లీ అభ్యర్థి అమిత్ శర్మ ఈ హామీలతో ఏకంగా పోస్టర్లను రూపొందించి నియోజకవర్గమంతా అంటించారు. ఆ పార్టీ తన మేనిఫెస్టోలో మద్యంపై రాయితీ, ఉచిత మేక పథకంతో పాటు పీహెచ్‌డీ వరకూ ఉచిత విద్య, ఢిల్లీ విద్యార్థులకు మెట్రో, బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రైవేట్‌ స్కూల్స్‌లోనూ ఉచిత విద్య, యువతుల వివాహానికి రూ 2.5 లక్షల నగదు సాయం, యువతకు రూ.10,000 నిరుద్యోగ భృతి, వృద్ధులకు, వికలాంగులకు రూ.5000 పెన్షన్‌ వంటి పలు హామీలను గుప్పించింది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్ధానాలకు మే 12న ఆరో విడతలో పోలింగ్‌ జరగనుంది.