ఏపీలో మద్యం ఏరులై పారుతోంది: చంద్రబాబు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో మద్యం ఏరులై పారుతోంది: చంద్రబాబు

March 14, 2022

babu

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సోమవారం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కల్తీ మద్యం తాగి మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ..”ఎన్నికల్లో వైసీపీ మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పింది. కానీ చేయలేదు. ఈ వైసీపీ పాలనలో రాష్ట్రంలో మద్యం, నాటుసారా ఏరులై పారుతోంది. కల్తీసారాను వైసీపీ నేతలే విక్రయిస్తున్నారు. మద్యం పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి, ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నారు” అని ధ్వజమెత్తారు.

అంతేకాకుండా రాష్ట్రంలో మద్యం తయారీ నుంచి విక్రయం వరకు సీఎం జగనే చేస్తున్నారు. కల్త్ సారా నియంత్రించేవరకూ తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎందరిని జైలులో పెట్టినా కేసులకు భయపడబడమని అన్నారు. కుటుంబాలకు తమ పార్టీ తరఫున సాయం చేస్తామని ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున మొత్తం 20 కుటుంబాలకు సాయం చేయనున్నట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే దాకా టీడీపీ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టంచేశారు. బాధిత కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు.