'Alcohol, lottery main sources of revenue in Kerala': Governor slams state government
mictv telugu

ఇలాంటి రాష్ట్రానికి గవర్నర్ అయినందుకు నాకే సిగ్గేస్తోంది

October 23, 2022

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆ రాష్ట్ర పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ క్యాపిటల్ గా ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కేరళ అధిగమిస్తుందని అన్నారు. కేరళ రాష్ట్రానికి కేవలం మద్యం, లాటరీలే ఆదాయవనరులుగా ఉండటాన్ని చూసి సిగ్గుపడుతున్నానని అన్నారు. మద్యం వినియోగానికి అందరూ వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటే కేరళ మాత్రం దీనిని ప్రోత్సహిస్తోందని లెఫ్ట్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.

ఇలాంటి రాష్ట్రానికి తాను ప్రథమ పౌరుడైనందుకు సిగ్గుగా అనిపిస్తోందన్నారు. ‘అసలు ఈ లాటరీలేంటి? పేద ప్రజలు లాటరీ టికెట్లు కొంటే ఇక్కడ కూర్చుని మీరు డబ్బులు లెక్క పెట్టుకుంటారా? లాటరీ పేరు చెప్పి ప్రజల్ని దోచుకుంటున్నారు. ప్రజల్ని మద్యానికి బానిసలుగా చేస్తున్నారు’ అంటూ తీవ్రంగా విమర్శించారు. గత కొంతకాలంగా పినరయి విజయన్‌ సర్కారు, గవర్నర్‌కు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గవర్నర్‌ కేరళ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.