లాక్ డౌన్ లోనూ మద్యం దుకాణాలను ఓపెన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెల్సిందే. దీంతో నిన్న పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం 25శాతం ధరలను పెంచుతూ మద్యం దుకాణాలను ఓపెన్ చేసింది. దీంతో మద్యంప్రియులు ఒక్కసారిగా వైన్స్ పై పడ్డారు. లాక్ డౌన్ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా మద్యం కోసం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలను నుంచి తీవ్ర వ్యక్తిరేకత వస్తుంది.
దీంతో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలను ఏకంగా 75శాతం పెంచింది. భవిష్యత్ లో మద్యం పేరు వినపడకూడదని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా మద్యాపానాన్ని నిరుత్సాహపరించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. రూ. 120 బ్రాండ్ మద్యంపై క్వార్టర్ కు రూ. 40, హాఫ్ పై రూ. 80, ఫుల్ బాటిల్ పై రూ. 80 పెంచారు. రూ. 120 – 150 ధర ఉన్న మద్యం..క్వార్టర్ కు రూ. 80, హాఫ్ పై రూ. 160, ఫుల్ బాటిల్ పై రూ. 320 పెంచారు. రూ. 150 ఆపై ఉన్న మద్యం..క్వార్టర్ పై రూ. 120, హాఫ్ పై రూ. 240, ఫుల్ బాటిల్ పై రూ. 480కి పెంచింది. బీర్పై రూ. 60, మినీ బీర్పై రూ. 40 పెంచింది.