అలర్ట్ : కాసేపట్లో హైద్రాబాదులో భారీ వర్షం - MicTv.in - Telugu News
mictv telugu

అలర్ట్ : కాసేపట్లో హైద్రాబాదులో భారీ వర్షం

April 15, 2022

avvvv

హైదరాబాదు ప్రజలకు గమనిక. మరికొద్దిసేపట్లో నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నగరానికి ఉత్తరం, పశ్చిమ దిక్కుల వైపు మేఘాలు దట్టంగా కమ్ముకొని ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో భారీ వర్షంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యాయి. ప్రజలు ఇళ్లనుంచి ఎవరూ బయటకు రాకూడదని, ఉద్యోగాలకు వెళ్లిన వారు వీలైనంత త్వరగా ఇళ్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు.