అలర్ట్ : ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. ఇకపై బీమా వర్తించదు - MicTv.in - Telugu News
mictv telugu

అలర్ట్ : ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. ఇకపై బీమా వర్తించదు

April 22, 2022

22

దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకీ పెరుగుతుండడంతో మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వీటిని అరికట్టడానికి అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కోర్టు ఆదేశాలతో బీమా క్లెయిమ్ నిబంధనలు కూడా మార్చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనలు ఎలా ఉన్నాయో చూడండి.

1. ఆటో, బైకుల మీద నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించే వారికి ఏదైనా ప్రమాదం జరిగితే వారికి ఇన్సూరెన్స్ రాదు. హెల్మెట్ లేకుండా బండి నడిపి ప్రమాదానికి గురైతే కూడా బీమా వర్తించదు.
2. రాంగ్ రూట్‌లో వెళ్తూ ప్రమాదానికి గురైతే బీమా సొమ్ము రాదు. అంతేకాక, రాంగ్ రూటులో వచ్చిన వారికి సరైన రూటులో వచ్చిన వారు గుద్దితే, గుద్దిన వారిపై ఎలాంటి కేసు నమోదు చేయరు.
3. రాంగ్ రూటులో వెళ్లేవారి వల్ల ప్రమాదం జరిగితే రూ. 20 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అంత డబ్బు వారి ఆస్తి విక్రయించినా రాకపోతే 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు.
4. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి బీమా సంస్థలు పరిహారాన్ని చెల్లించవు.
5. సీటుబెల్టు ధరించని వారికి కూడా ఇలాంటి నిబంధనలే వర్తిస్తాయి.
6. స్పీడ్ లిమిట్ దాటి వాహనం నడిపి ప్రమాదానికి గురైతే కూడా పరిహారం ఇవ్వరు.
7. మొబైల్ మాట్లాడుతూ ప్రయాణించే వారికి జరిగే ప్రమాదాలకు కూడా ఇన్సూరెన్స్ వర్తించదు. హెల్మెట్ ధరించి, సరైన రూటులో వచ్చినా, మద్యం తాగకుండా వాహనం నడుపుతున్నా.. ఫోన్ మాట్లాడుతూ ప్రమాదానికి గురైతే బీమా పరిహారాన్ని కంపెనీలు ఇవ్వవు. కాబట్టి ఇప్పటినుంచైనా జాగ్రత్తగా వాహనం నడపండి.