Home > Featured > ఉగ్రముప్పు.. తిరుపతిలో రెడ్ అలర్ట్..

ఉగ్రముప్పు.. తిరుపతిలో రెడ్ అలర్ట్..

tirupati.

తమిళనాడులో ఉగ్రవాదులు ప్రవేశించారన్న నిఘా వర్గాల సమాచారంతో ఏపీ పోలీసులు తిరుపతిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు వచ్చే వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. లష్కరే తోయిబాకు చెందిన టెర్రరిస్టులు శ్రీలంక ద్వారా భారత్‌లోకి ప్రవేశించారు. ఆరుగురు ఉగ్రవాదులు చెన్నైలోకి ప్రవేశించారని సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరికలతో తమిళనాడులో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు తమిళనాడులో గాలింపు చర్యలు చేపట్టారు.

Updated : 23 Aug 2019 10:28 AM GMT
Tags:    
Next Story
Share it
Top