Alert to devotees.. TTD to release Special darshan tickets tomorrow
mictv telugu

భక్తులకు అలర్ట్.. రేపే స్పెషల్ దర్శనం టికెట్లు విడుదల

July 6, 2022

Alert to devotees.. TTD to release Special darshan tickets  tomorrow

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ రేపు విడుదల చేయనుంది. సెప్టెంబర్‌ నెల‌కు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 7 గురువారం ఉద‌యం 9 గంట‌ల‌కు విడుదల చేయనున్నట్లు తెలిపింది. అలాగే శుక్రవారం సెప్టెంబర్ నెల వసతి గదుల కోటాతో పాటు వర్చువల్ సేవా టికెట్లు రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఈ దర్శన టికెట్ల‌ను బుక్ చేసుకోవాల్సిందిగా కోర‌డ‌మైన‌ది. శ్రీవారి భ‌క్తులు టీటీడీ వెబ్‌సైట్‌ https://tirupatibalaji.ap.gov.in ద్వారా స్వామివారి దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

ఇక, తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామి వారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. మంగళవారం శ్రీవారిని 73,439 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,490 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.35 కోట్లుగా ఉంది. సర్వదర్శనానికి 31 కంపార్టమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతుంది.