Alert: WhatsApp will not work on these phones from October.
mictv telugu

అలెర్ట్: అక్టోబర్ నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు..

September 2, 2022

దేశవ్యాప్తంగా పాత ఐఫోన్‌లు వాడుతున్న వారికి ప్రముఖ మొబైల్ యాప్ వాట్సాప్ సంస్థ ఓ షాకింగ్ విషయాన్ని తెలియజేసింది. వచ్చేనెల (అక్టోబర్) నుంచి పాత ఐఫోన్లలో వాట్సాప్ సపోర్ట్‌ చేయదని, సపోర్ట్ చేయని ఆ పాత ఐఫోన్లలో వాట్సాప్ సేవలను పూర్తిగా ఆపివేస్తున్నామని తెలిపింది. కావున పాత ఐఫోన్ల వాడుతున్నవారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరింది. ఈ విషయంపై ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఆపిల్‌ క్లారిటీ ఇచ్చింది.

ఆపిల్‌ ఇచ్చిన సపోర్ట్ అప్‌డేట్ ప్రకారం..”కొన్ని పాత ఐఫోన్లలో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ పని చేయదు. WABetaInfo ప్రకారం, మెసేజింగ్ యాప్ అక్టోబరు 24 నాటికి iOS 10, iOS 11 పరికరాల్లో పనిచేయదు. యూజర్‌లు మీ స్మార్ట్‌ఫోన్‌లలో ఈ యాప్ ఉపయోగించడం కొనసాగించాలంటే, తప్పనిసరిగా మీ ఐఫోన్లు అప్‌డేట్ చేసుకోవాలి. ఇదివరకే ఈ విషయాన్ని వాట్సాప్..ఐఫోన్ వినియోగదారులను ఉద్దేశిస్తూ, దాని హెల్ప్‌ సెంటర్‌ పేజీలో స్పష్టం చేసింది. అయితే, ఈ సవరణ iPhone 5, iPhone 5c అనే రెండు ఐఫోన్ వెర్షన్‌లను మాత్రమే ప్రభావితం చేస్తుంది” అని పేర్కొంది.

అయితే, పాత ఐఫోన్లు ఉన్నవారు ఎలా అప్‌గ్రేడ్ చేయాలి? అనే దానిపై ఆపిల్‌ పలు సూచనలు చేసింది.”ముఖ్యంగా iOS 10, iOS 11 అనేవి ఐఫోన్ల పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లు. ఐఫోన్ ఇంకా అప్‌డేట్ కాకపోతే వెంటనే అప్‌డేట్ చేయడం మంచిది. సెట్టింగ్‌లు జనరల్‌కి నావిగేట్ చేయండి. ఇక్కడ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ని ఎంచుకుని, ఆపై సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడానికి లేటెస్ట్‌ iOS వెర్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది” అని తెలియజేసింది.