అలియా-రణబీర్ ఫేక్ వెడ్డింగ్ కార్డ్ వైర‌ల్‌ - MicTv.in - Telugu News
mictv telugu

అలియా-రణబీర్ ఫేక్ వెడ్డింగ్ కార్డ్ వైర‌ల్‌

October 23, 2019

బాలీవుడ్ నటీనటులు ర‌ణ్‌బీర్ క‌పూర్, అలియా భ‌ట్‌లు ప్రేమలో ఉన్న సంగ‌తి తెలిసిందే. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయి. దీంతో వీరు త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. కానీ, వీరి వివాహం ఎప్పుడనేది ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ తాజాగా అలియా, ర‌ణ్‌బీర్ వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. 

View this post on Instagram

Good morning ❤ #aliabhatt

A post shared by Viral Bhayani (@viralbhayani) on

22 జ‌న‌వ‌రి 2020న జోధ్‌పూర్‌లోని ఉమైద్ ప్యాలెస్ భ‌వ‌న్‌లో వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని కార్డ్‌లో ఉంది. ఈ కార్డ్ గురించి మీడియా అలియాని ప్ర‌శ్నించింది. ఇందుకు ఆమె గ‌ట్టిగా న‌వ్వి, న‌న్ను ఏం చెప్ప‌మంటారు. ఇది నిజం కాదు అని చెప్పింది. ప్ర‌స్తుతం అలియా, ర‌ణ్‌బీర్ క‌పూర్ బ్ర‌హ్మ‌స్త్రా అనే చిత్రంలో క‌లిసి న‌టిస్తున్నారు. ఇందులో అక్కినేని నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.