Alia Bhatt reacts to Boycott Brahmastra trend
mictv telugu

బాయ్‌కాట్ గురించి పెద్దగా పట్టించుకోను.. ఆలియా భట్

September 8, 2022

స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ మరి కొన్నిగంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు. కాగా.. ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ నటుడు నాగార్జున, నాగినీ ఫేమ్ మౌనీ రాయ్ కీలకపాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. అయితే.. ఈ సినిమాకి కూడా బాలీవుడ్‌లోని విడుదల అవుతున్న మిగిలిన సినిమాల్లాగే.. ఈ మూవీకి కూడా బాయ్‌కాట్ సెగ తగిలింది.

రణ్‌బీర్, ఆలియా స్టార్ కిడ్స్ కావడం, కరణ్ జోహార్ ఈ మూవీకి నిర్మాత కావడం, ఇష్టం లేకపోతే సినిమా చూడకండని ఆలియా పొగరుగా మాట్లాడడంతో ఈ మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండింగ్ చేశారు. దీంతో మూవీ టీం సినిమా ఫలితంపై కొంచెం సందిగ్ధంలో పడింది. దీనిపై తాజాగా ఆలియా భట్ స్పందిస్తూ.. ‘ఈ సినిమాపై ఎటువంటి నెగిటివిటీ లేదు. అంతా పాజిటివ్‌గానే ఉంది. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. కాబట్టి బాయ్‌కాట్ గురించి పెద్దగా ఆలోచించడం లేదు’ అని సమాధానం చెప్పింది. చూడాలి మరి.. ఈ సినిమా అయిన బాలీవుడ్‌ ఫెయిల్యూర్స్‌ని ఆపగలుగుతుందా లేదంటే బాయ్‌కాట్‌లో కొట్టుకుపోతుందా అని.