‘ప్రభాస్ తో ఛాన్స్ వస్తే వదులుకోను’ - MicTv.in - Telugu News
mictv telugu

‘ప్రభాస్ తో ఛాన్స్ వస్తే వదులుకోను’

May 15, 2017


సౌతిండియా స్టార్స్ లో ప్రభాస్‌ అంటే చాలా ఇష్టమని బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ చెబుతోంది. విజువల్ వండర్‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌తో పనిచేసే అవకాశం వస్తే అస్సలు వదులుకోనంటోంది. ఈ విషయాలన్నీ ఆలియా అభిమానులతో ట్విటర్‌ లో వెల్లడించింది.

‘బాహుబలి 2’ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఎలా చెప్తారు అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. ‘ఈ భారీ విజయానికి మరో పేరు కావాలా? ఇదో రాక్‌ బస్టర్‌ మూవీ. నాకు చాలా నచ్చింది’ అని జవాబు ఇచ్చింది. ఆలియా ప్రస్తుతం డ్రాగన్‌, గల్లీ బాయ్‌ సినిమాల్లో నటిస్తోంది.

HACK:

  • Alia Bhatt says that she will never lose a chance with Prabhas.