ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి అందులో సీతగా నటించిన ఆలియా భట్, తారక్ ల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ కుదిరింది. ఇది చాలాసార్లు బయటపడింది కూడా. ప్రమోషన్స్ లో కూడా ఆలియా మీద ఎన్టీయార్ జోకులు వేయడం…తను కూడా సరదాగా నవ్వడం లాంటివి చూశాం. ఆలియాకి తారక్ అంటే చాలా ఇష్టమని చాలాసార్లు చెప్పింది కూడా. ఇప్పుడు మరోసారి తన అభిమానాన్ని చాటుకుంది సొట్టబుగ్గల చిన్నది.
ఎన్టీఆర్ పిల్లలు అభయ్ – భార్గవ్ లకు అలియా తన సొంత శ్రేణి కిడ్స్ బ్రాండ్ దుస్తులను పంపింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఎన్టీఆర్ తన ఇన్ స్టాలో అలియా భట్ కి కృతజ్ఞతలు తెలిపారు. ధన్యవాదాలు అలియా …ఎప్పుడూ అభయ్ , భార్గవ్ ముఖాలపై చిరునవ్వు నింపుతావు.. త్వరలో నా పేరుతో ఒక బ్యాగ్ ని చూస్తానని ఆశిస్తున్నాను అని ఆలియాపై తన అభిమానాన్ని కురిపించారు. దీనికి ప్రతిస్పందించిన ఆలియా భట్ .. మీకోసం ప్రత్యేకించి అడల్ట్ వేర్ దుస్తుల రంగంలో ప్రవేశిస్తానని సరదాగా వ్యాఖ్యానించింది. దానికి మళ్ళీ తారక్ హాహా ..అంటూ స్మైలీ ఎమోజీ పెట్టారు. నేను మీ కోసం మాత్రమే ప్రత్యేకమైన ఎడ్- వేర్ శ్రేణిని తయారు చేస్తాను. స్వీటెస్ట్ థాంక్స్ అని రాసింది. ఆలియా రెండేళ్ళ క్రితమే పిల్లల దుస్తుల శ్రేణి వ్యాపారంలో ప్రవేశించింది. 2021లో ఆలియా తన సొంత కిడ్స్ డ్రెస్సింగ్ లేబుల్ ని ప్రారంభించింది.
RRR విడుదలైన ఏడాది తర్వాత కూడా ఎన్టీఆర్ చరణ్ లతో తన స్నేహాన్ని కొనసాగిస్తోంది ఆలియా. ఇటీవల ఆర్.ఆర్.ఆర్ నాటు నాటుకు ఆస్కార్ పురస్కారాలను గెలుచుకున్న ఆనందాన్ని సోషల్ మీడియాల్లో తన అభిమానులతో పంచుకుంది. అంతర్జాతీయ అవార్డుల స్క్రీన్ షాట్ లను పోస్ట్ చేసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది.