అలియా భట్‌పై ఇంత కసిగానా? 35 లక్షల డిస్‌లైక్స్! - MicTv.in - Telugu News
mictv telugu

అలియా భట్‌పై ఇంత కసిగానా? 35 లక్షల డిస్‌లైక్స్!

August 12, 2020

Alia Bhatt's 'Sadak 2' trailer get 2 million dislikes on youtube..

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణాన్ని ఆయన అభిమానులు ఇంకా మరవలేకపోతున్నారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో అతడి గురించి చర్చిస్తున్నారు. బాలీవుడ్ సెలెబ్రిటీలు కరణ్ జోహార్, అలియా భట్, ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మహేష్ భట్ వల్లే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నడాని పలువురు అనుమానిస్తున్నారు. నిత్యం సోషల్ మీడియాలో సుశాంత్ మృతి కేసును వైరల్ చేస్తూ సీబీఐకి చేతుల్లోకి వెళ్లేలా చేశారు. అలాగే సుశాంత్ మృతికి కారణమైన వాళ్ళను ఎవరినీ వదలడం లేదు. సుశాంత్ మృతికి కారణమైన బాలీవుడ్ బంధుప్రీతిపై ఇంకా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన ‘సడక్‌ 2’ సినిమానే ఇందుకు చక్కటి ఉదాహరణ. ఆలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్, సంజయ్ దత్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ ఈరోజు యూట్యూబ్ లో విడుదలైంది. దీంతో సుశాంత్ అభిమానులు తమ కోపాన్ని ఈ ట్రైలర్ పై చూపిస్తున్నారు. విడుదలైందే మొదలు డిస్‌లైక్‌లు కొడుతూనే ఉన్నారు. ఇప్పటివరకు 26 లక్షల మంది ఈ ట్రైలర్ ను డిస్‌లైక్‌ చేశారు. కేవలం లక్షన్నర మంది మాత్రమే లైక్ చేశారు. దీన్ని బట్టి ఈ సినిమాపై ఎంత వ్యతిరేకత ఉందో అర్ధమవుతోంది. అంతేకాదు ఈ సినిమాను ఓటీటీలో చూడొద్దని.. అసలు ఆ సినిమాను రిలీజ్ చేసే హాట్‌స్టార్ యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయాలనీ #UninstallHotstar అనే హాష్ ట్యాగ్ ను సోషల్ మీడియా ట్రెండ్ చేస్తున్నారు. ఇక డిస్నీ హాట్ స్టార్‌లో ‘సడక్ 2’ ఈ నెల 28న విడుదల కానుంది. 1991లో వచ్చిన సడక్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది.