రేప్ చేసి చంపేస్తా.. ఆలియా భట్ సోదరికి బెదిరింపులు - MicTv.in - Telugu News
mictv telugu

రేప్ చేసి చంపేస్తా.. ఆలియా భట్ సోదరికి బెదిరింపులు

July 14, 2020

Shaheen Bhatt

బాలీవుడ్‌లో స్టార్ హీరో సుశాంత్  సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత నెపోటిజంపై సోషల్ మీడియాలో బాగా చర్చ సాగుతోంది. మహేష్‌ భట్‌, ఆలియా భట్‌లపై విమర్శలు గుప్పించిన నెటిజన్లు ఆమె నటించిన ‘సడక్ 2’ సినిమాను నిషేధించాలని నినదించారు. తాజాగా ఆమె సోదరి షాహీన్‌ భట్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆమెను చంపేస్తామని.. అత్యాచారం చేస్తామని బెదిరిస్తూ మెసేజ్‌‌లు పంపిస్తున్నారట. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షాహీన్ పంచుకున్నారు. 

ఇవి తనను ఎలాంటి ఆశ్చర్యానికి గురి చేయడం లేదన్నారు‌. అంతేకాక ఈ తరహా విద్వేష పూరిత బెదిరింపుల్ని సీరియస్‌గా తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. గుర్తు తెలియ‌ని సైట్ల నుంచి ఇలాంటి బెదిరింపులు పాల్పడే వారిని ఐపీ అడ్రెస్‌లతో గుర్తించ‌డం ఖాయ‌మ‌ని అన్నారు షాహీన్‌. కాగా, నెపోటిజంపై ఇంతకుముందు ఆలియా తల్లి సోనీ రాజ్దాన్ కూడా కంగనా లాంటివారి మీద పరోక్షంగా కామెంట్లు చేశారు. ‘ఇవాళ నెపోటిజం గురించి మాట్లాడుతున్నవారు రేపు తమ పిల్లల విషయంలో ఎలా ఆలోచిస్తారో’ అని విమర్శలు ఎక్కుపెట్టారు. మరోవైపు ఖాన్‌లు, కపూర్‌ల కుటుంబాలతో పాటు కరణ్‌ జోహర్‌ మీద కూడా తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.