ఆలియా - రణ్‌బీర్ కపూర్ల పెళ్లి అయిపోయింది - MicTv.in - Telugu News
mictv telugu

ఆలియా – రణ్‌బీర్ కపూర్ల పెళ్లి అయిపోయింది

April 14, 2022

aia

బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆలియా భట్, రణబీర్ కపూర్ల వివాహం గురువారం కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. రణబీర్ కపూర్ కుటుంబ ఇల్లు బాంద్రాలోని ‘వాస్తు’లో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్‌కు కరీనా కపూర్, కరిష్మా కపూర్, నిర్మాత కరణ్ జోహార్, ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అయితే పెళ్లికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. కొద్ది సేపట్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయనున్నారని సమాచారం.