ఎయిర్‌పోర్టులో అలియా పరుగులు - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిర్‌పోర్టులో అలియా పరుగులు

May 4, 2022

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ అలియా భట్‌ పెళ్లి తర్వాత మొదటిసారిగా ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టులో పరుగులు తీస్తూ కనిపించింది. దాంతో అక్కడున్న జనం ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోను వీక్షించిన కొందరు అలియాకు ఏమైంది? ఎందుకలా పరుగులు తీస్తుంది? అని ఆరా తీయడంతో అసలు నిజం తెలిసింది.

 

అది షూటింగ్‌లో ఓ భాగమట. ఆమె తాజాగా నటిస్తున్న ‘రాఖీ జౌర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’సినిమా షూటింగ్‌ ఇటీవలే ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టులో జరిగింది. అలియా తన లగేజ్‌ ట్రాలీని తోసుకుంటూ పరుగెత్తుతుండగా, మూవీ సిబ్బంది కెమెరాలతో ఆమె ముందు పరుగెత్తారు. అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు ఆ సన్నివేశాన్ని తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాల్లో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మరోపక్క వీడియోలో ఆలియాతోపాటు ప్రముఖ డైరెక్టర్‌ కరణ్‌ జోహార్‌ కూడా కనిపించాడు. కరణ్‌ జోహార్‌ చాలా కాలం తర్వాత రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌లతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది 2023 ఫిబ్రవరి 10న విడుదల చేయబోతున్నట్టు ఇటీవలే చిత్ర బృందం ప్రకటించింది.