రాజమౌళిపై అలిగిన నటి.. పోస్టులు డిలీట్ - MicTv.in - Telugu News
mictv telugu

రాజమౌళిపై అలిగిన నటి.. పోస్టులు డిలీట్

March 29, 2022

rj

ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. వసూళ్లు కూడా భారీ స్థాయిలోనే వచ్చాయి. అయితే సినిమాలో కొందరి పాత్రలకు ప్రాముఖ్యత, నిడివి తక్కువుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ పాత్రకున్నంత ప్రాధాన్యత ఎన్టీఆర్‌కు లేదనే విమర్శ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ విషయంపై నొచ్చుకున్న ఎన్టీఆర్ సినిమా విడుదల తర్వాత కాస్త ముభావంగానే ఉన్నారని ఆయన సన్నిహితులు చెప్తున్న మాట. ఈ క్రమంలో బాలీవుడ్ నటి అలియా భట్ కూడా రాజమౌళిపై కోపంగా ఉన్నారని బి టౌన్ టాక్. బాహుబలి చూసి రాజమౌళి సినిమా అనగానే అలియా వెంటనే ఒప్పేసుకుంది. ఎన్నో ఆశలతో షూటింగులో పాల్గొంది. విడుదల ముందు వరకు కూడా అనేక ప్రమోషన్లలో అలియా హుషారుగా పాల్గొంది. సినిమా రిలీజవ్వగానే తన పాత్ర నిడివి తక్కువుండడంతో పాటు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో నొచ్చుకుంది. అంతేకాక, బాలీవుడ్‌లో ఎంతో పేరున్న అలియాభట్ పాత్రను చూసి ఉత్తరాదిలో ఆమె అభిమానులు నిరాశకు లోనయ్యారు. దీంతో అలియా రాజమౌళిని ఇన్‌స్టాలో అన్ ఫాలో చేసింది. సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను డిలీట్ చేసింది.