బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తల్లి కాబోతోంది. తాజాగా హాస్పిటల్లో టీవిని చూపిస్తూ, అలియాభట్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో.. అలియాభట్ హాస్పిటల్‌లోని ఓ బెడ్‌పై పడుకుని ఉంది. పక్కన టీవీ మానిటర్లో లవ్ సింబల్ కనిపిస్తోంది. పక్కనే భర్త రణ్‌బీర్ కూడా ఉన్నాడు. టీవివైపు నవ్వుతూ చూస్తుంది. ఆ టీవీపై బేబి సింహంతో రెండు సింహాలు అన్యోన్యంగా కలిసి ఉన్నాయి.
View this post on Instagram
అలియాభట్ ఫోటోను షేర్ చేస్తూ, తమ బేబీ త్వరలో వస్తోంది అంటూ ఆమె రాసుకొచ్చింది. దాంతో రకుల్ ప్రీత్ సింగ్, కరణ్‌జోహార్, మౌనీ రాయ్ వంటి పలువురు సెలబ్రెటీలు అభినందనలు తెలిపారు. కొన్ని సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్నా, రణ్‌బీర్ కపూర్, అలియా భట్లు ఏప్రిల్ 14న వివాహం బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.
వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆలియాభట్ పలు సినిమాల్లో నటిస్తూ వస్తోంది. తాజాగా ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని డాక్టర్లు తెలియజేయడంతో తమ అభిమానులకు ఈ విషయాన్ని తెలియజేసింది. ప్రస్తుతం వీరిద్దరూ బ్రహ్మాస్త్ర చిత్రంలో కలిసి నటిస్తున్నారు.