గ్రహాంతరజీవాన్ని గుర్తించాం.. నాసా సంచలన ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

గ్రహాంతరజీవాన్ని గుర్తించాం.. నాసా సంచలన ప్రకటన

April 2, 2018

గ్రహాంతరవాసుల ఉనికిపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) సంచలన ప్రకటన చేసింది. భూగ్రహానికి పొరుగునే ఉన్న శుక్ర(వీనస్) గ్రహంపై గ్రహాంతర జీవుల జాడను గుర్తించినట్లు వెల్లడించింది. ‘వీనస్‌ మేఘాల్లో నల్లటి జాడలను గుర్తించారు. వాటిలో జీవ పదార్థం ఉంది. ఏలియన్లు అక్కడే ఉండొచ్చు. దీనిపై త్వరలోనే స్పష్టత ఇస్తాం..’ అని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

వీనస్‌ గ్రహంపై దుర్భరణ వాతావరణం ఉంటుందని, 500 డిగ్రీ సెల్సియస్‌ ఉష్టోగ్రత, ఆమ్ల వర్షాలను తట్టుకుని అక్కడ పరిశోధనలు నిర్వహిస్తామని వెల్లడించారు. 24 కోట్ల డాలర్లను దీనికి వెచ్చించనున్నారు. కాగా,  ఏలియన్ల మనుగడ విషయంలో నాసా వాస్తవాలను దాస్తోందని బకింగ్‌హమ్‌ యూనివర్సిటీ పరిశోధకుడు బారీ డి గ్రెగోరియో ఆరోపించారు.  నాసా దశాబ్దాల కిందటే అంగారక గ్రహంపై గ్రహాంతరవాసుల జాడను కనిపెట్టిందని అన్నారు.