Ali's couples met Megastar Chiranjeevi
mictv telugu

మెగాస్టార్‎ను కలిసిన అలీ

November 11, 2022

కుమార్తె వివాహం నేపథ్యంలో ప్రముఖ నటుడు అలీ.. అతిథులను ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిసిన అలీ, జుబేదా దంపతులు వివాహ పత్రికను అందజేశారు. తమ కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరు కావాలంటూ మెగాస్టార్‌ను ఆహ్వానించారు. ఈనెల 27న హైదరాబాదులోని అన్వయ కన్వెన్షన్స్ వేదికగా అలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం జరగనుంది.

ఇప్పటికే అలీ పలువురు ప్రముఖులను కలిసి పెళ్లికి ఆహ్వానించారు. సీఎం జగన్, గవర్నర్ తమిళిసై తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులకు వివాహ పత్రిక అందజేశారు. తాజా మెగస్టార్‌ను కూడా కలిసేశారు. అయితే అలీకి అత్యంత ఆప్తుడైన పవన్ కల్యాణ్‌ను వివాహానికి ఆహ్వానించారా లేదా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. సినీ రంగంలో మంచి స్నేహితులుగా వీళ్లిద్దరు రాజకీయంగా దూరమయ్యారు. అలీ వైసీపీలో చేరడంతో పాటు పవన్‌ను విమర్శించడం వీరి మధ్య మరింత దూరం పెరిగింది. ఇప్పుడు కుమార్తె వివాహానికి పవన్‌ను ఆహ్వానించారా ? లేదా అన్న దానిపై సస్పెన్షన్ నెలకొంది.